పోలీస్ స్టేషన్’లో వీహెచ్ హల్ చల్ 

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై తాను ఇచ్చిన ఫిర్యాదుని ఎందుకు స్వీకరించలేదని పోలీసులని నిలదీశారు. తాము న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నామని, ఇందులో కేసు నమోదు చేసే అంశాలు లేవని.. అందుకే కేసు నమోదు చేయలేక పోయామని పోలీసులు సమాధానమిచ్చారు. పోలీసుల సమాధానంతో సంతృప్తి చెందన వి.హెచ్. హైకోర్టును ఆశ్రయిస్తానని పోలీసులను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సెక్యూలర్ దేశంలో అందరూ హిందువులేనంటూ మిగిలిన మతాల వారిన బాధ పెట్టిన ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్‌పై కేసు ఎందుకు పెట్టరని వీహెచ్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశంలో అన్ని మతాలు సమానమన్న మాటలు నమ్మాలా ? లేక 130 కోట్ల మంది హిందువులేనన్న మోహన్ భగవత్ మాటలను నమ్మాలా ?? అంటూ వీహెచ్ తనదైన శైలిలో ప్రశ్నించారు