కోసి కారం పెట్టిన కల్యాణ్ రామ్

నందమూరి హీరో కల్యాణ్ రామ్ విలన్స్ కోసి కారం పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన హీరో సతీష్ విగ్నేశ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంతమంచివాడవురా’. మెహ్రీన్ హీరోయిన్. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరుగుతోంది.

ఈ సందర్భంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో కల్యాణ్ రామ్ సాఫ్ట్ గా కనిపిస్తూనే తనలోని మాస్ యాంగిల్ ని చూపించారు. అంతేకాదు.. ప్రేమ, బందుత్వాల గురించి ఆకట్టుకొనే డైలాగ్స్ చెప్పారు. ‘ఎదురించేవాడు రానంతవరకే.. భయపెట్టేవాడే రాజ్యం’, ‘మీరు నా తండ్రి నాన్న మీరు కొట్టకపోతే ఎవరు కొడతారు’ అనే డైలాగ్స్ బాగా పేలాయ్. ఆఖరులో ఇంకోసారి మా నాన్న జోలికి వచ్చినా, ఆయన వైపు కన్నెత్తి చూసిన నాకు, వాడికి కోసి కారంపెడతా అన్నట్టుగా జామ్ కాయ్ ని కోసి కారం పెట్టే సీన్ హైలైట్ గా నిలిచింది.