సీఎం జగన్’ని కలిసిన మృత్యుకారులు.. తలో రూ.5లక్షలు అందజేత !

పాక్ చెర నుంచి విడుదలైన మృత్యుకారులు ఏపీకి చేరుకున్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిశారు. పాకిస్థాన్ చెర నుంచి స్వేచ్ఛా జీవితం ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాసేపు మృత్యుకారులతో మాట్లాడిన సీఎం జగన్.. అక్కడే తలో రూ. 5లక్షల చెక్కుని అందజేశారు.

2018 నవంబరు 27న అరేబియా సముద్రం గుజరాత్ తీరంలో మొత్తం 22 మంది చేపల వేట చేస్తూ పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో ఆ దేశ భద్రతా సిబ్బంది వీరిని అరెస్టుచేసి 13 నెలల పాటు జైల్లో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వీరి విడుదలకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసింది.

మొత్తం 22 మందిలో 20 మందిని మాత్రమే పాకిస్తాన్ విడుదల చేసింది. మిగితా ఇద్దరి విడుదల కోసం కూడా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఆ ఇద్దరు కూడా విడుదలైతే ఆనందంగా ఉండేదని మృత్యుకారులు అభిప్రాయపడ్డారు. విడుదలైన 20మందిలో 15 మంది శ్రీకాకుళం జిల్లా,  5గురు విజయనగరం జిల్లాకు చెందిన వారు ఉన్నారు.