అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడి 


అగ్రరాజ్యం అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడికి దిగింది. ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ బలగాలు క్షిపణులతో దాడికి దిగాయి. ఇరాక్‌లోని ఆల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై డజనుకుపైగా క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడింది. ఈ దాడిలో అమెరికా సైనికులకు జరిగిన నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎయిర్‌బేస్‌లపై దాడిని పెంటగాన్‌ ధ్రువీకరించింది.

 తాజా పరిస్థితులపై ట్రంప్‌ స్వయంగా సమీక్షిస్తున్నారని, సరైన సమయంలో బదులిస్తామని అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్‌కు సమర్పించామని, ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్‌ హౌస్‌ వెల్లడించింది. అమెరికా-ఇరాన్ ల మధ్య చోటు చేసుకొంటున్న పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయి.