15యేళ్ల అనుభవంపై కత్రినా కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ 15యేళ్ల కెరీర్ ని పూర్తి చేసుకొంది. ఆమె కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శనలని ఎదుర్కొంది. నటన రాదని, డ్యాన్స్ చేయడం అసలే రాదనే విమర్శలొచ్చాయ్. ఐతే, అత్యంగా వేగంగా కత్రినా నటన, డ్యాన్స్ లోనూ రాటుదేలింది. బాలీవుడ్ లోనే బెస్ట్ డ్యాన్సర్ గా ఎదిగింది. వరుసగా స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. డేటింగ్ చేయడంలోనూ కత్రినా ఫేమస్. సల్మాన్ ఖాన్ తో చాన్నాళ్లు డేటింగ్ లో ఉంది.
ఆ తర్వాత యంగ్ హీరో రణ్ బీర్ సింగ్ తో కలిసి తిరిగింది. తాజాగా ఓ హిందీ టాక్ షోకి హాజరైన కత్రినా తన 15యేళ్ల కెరీర్ పై స్పందించింది. “ఒక నటిగా నేను ఎంతో సంతృప్తి పొందాను. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాను. నేను ఈ ప్రపంచంలో అమితంగా ఇష్టపడే ప్రదేశం సినిమా సెట్. ఈ పదిహేనేళ్లలో నాకు వచ్చిన ప్రతీ పాత్రను ఎంతో ఇష్టపడి చేశాను. సినిమాల వల్ల ప్రపంచంలోని చాలా ప్రదేశాలకు వెళ్లగలిగాను. చాలా ప్రశాంతతను పొందా”నని తెలిపింది.