రాహుల్.. తల్లిదండ్రులకి ఫ్లాట్ కొనివ్వకుండానే కారు కొన్నాడా.. ?

సింగర్, బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ మాట తప్పాడా ? బిగ్ బాస్ 3 ప్రైజ్ మణితో వచ్చిన డబ్బుతో తల్లిదండ్రులకి ఫ్లాట్ కొనిస్తానని రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే, ఈలోగా రాహుల్ కాస్ట్లీ కారుకొనేశాడు. బెంజ్ కారుని కొన్నాడు. దీంతో.. రాహుల్ తల్లిదండ్రులకి ఫ్లాట్ కొనకముందే.. కారు కొనుకొన్నాడు. మాట తప్పాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ కామెంట్స్ పై రాహుల్ స్పందించారు. ‘ఆల్రెడీ ఫ్లాట్ తీసేసుకున్నాను. అది చేతికి రావడానికి మరో 7నెలల పడుతుంది. ఈలోగా కారుకి కూడా గాలమేశాను’ అంటూ రాహుల్ క్లారిటీ ఇచ్చారు. నిజం తెలుసుకున్న ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక బిగ్ బాస్ 3 తర్వాత రాహుల్ సింగర్ గా మరింత బిజీ అయ్యారు. అంతేకాదు.. నటుడుగా పరిచయం కాబోతున్నాడు.

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగమార్తాండ సినిమాలో రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమా హిట్టయితే మాత్రం.. రాహుల్ నటుడిగా బిజీ అయ్యే అవకాశాలున్నాయి. బిగ్ బాస్ 3లో రాహుల్-పునర్నవిల రొమాన్స్ హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.