లైవ్ : సరిలేరు చిత్రబృందం స్పెషల్ ఇంటర్వ్యూ

సంక్రాంతి సినిమాల సందడి మాములుగా లేదు. ప్రమోషన్స్ తో పిచ్చెకిస్తున్నాయ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్ టైన్ మెంట్ ‘Never Before Ever After’ పేరుతో సరిలేరు చిత్రబృందంతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. యాంకర్ సుమ సరిలేరు చిత్రబృందాన్ని ఇంటర్వ్యూ చేస్తోంది.

మహేష్ బాబు, అనిల్ రావిపూడి, రస్మిక, దేవిశ్రీ ప్రసాద్ లు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఎఫ్ 2 సినిమా సమయంలోనే అనిల్ ఈ కథ చెప్పారు. కథ నచ్చింది. కానీ చేయడానికి కాస్త సమయం పాడుతుంది. వెయిట్ చేయగలరా ? అని అడిగా. ఆయన ఓకే అని చెప్పారు. ఇంతలో ఫ్యామిలీతో కలిసి ఇంట్లో ఎఫ్ 2 సినిమా చూశాం. ఆ సినిమా చూసి మా పిల్లపు పడి పడి నవ్వుకొన్నారు. దీంతో.. ఆ సినిమాని ఇంకాస్త ముందుగానే చేయొచ్చు కదా అనుకొన్నా. అనిల్ ని అడిగితే ఓకే అన్నారు. అలా.. సరిలేరు మొదలైందని మహేశ్ తెలిపారు. ఆ ఇంటర్వ్యూ కొనసాగుతోంది. మీరు లైవ్ లో చేసేయండీ.. !