‘జాను’ టీజర్ టాక్

శర్వానంద్-సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళ్ హిట్ ’96’కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో ‘జాను’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

మంచి ఫీల్ తో టీజర్ సాగింది. స్కూల్ దశ నుంచి జీవితంలో వివిధ దశల్లో శర్వా-సామ్ మధ్య ప్రేమని చూపించారు.  టీజర్ లో ఉన్న సింగిల్ డైలాగ్.. చాలా దూరం వెళ్లిపోయావా రామ్ ? అని సమంత అడిగితే.. నిన్నెక్కడ వదిలేశానో.. అక్కడే ఉన్నాను అని శ్వరా సమాధానం ఇచ్చాడు. జాను టీజర్ ని చూస్తే.. 96 మేజిక్ రిపీట్ అయ్యేలా ఉంది.

2000 దశాబ్ధంలోనే బెస్ట్ ప్రేమకథా చిత్రంగా నిలిచింది తమిళ చిత్రం ’96’. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి-త్రిషగా జంటగా నటించిన చిత్రమిది. 2018 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడీ ప్రేమకథాచిత్రం తెలుగులో శర్వానంద్-సమంత జంటగా జానుగా రాబోతుంది. మీ మొత్తం జీవితాన్నికి ఓ అర్థం చెప్పే ఓ జ్ఞాపకంలా జాను ఉంటుందని ఇటీవల సమంత చెప్పిన సంగతి తెలిసిందే.