ఎన్టీఆర్ కోరిక తీర్చిన కల్యాణ్ రామ్

హీరో కల్యాణ్ రామ్ ఆయన తమ్ముడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోరిక తీర్చాడు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఎంతమంచివాడావురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సతీష్ విగ్నేశ దర్శకత్వం వహించారు. మెహ్రీన్ కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల  ముందుకు రానుంది.

బుధవారం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన తారక్.. ఇప్పటికే అన్న కల్యాణ్ రామ్ విభిన్నమైన సినిమాల్లో నటించారు. కానీ, ఫామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో నటించలేదు. అలాంటి సినిమాల్లో అన్నయ్య నటిస్తే చూడాలని ఉండేది. ఇప్పుడు ఎంతమంచివాడవురాతో నా కోరిక తీరింది అన్నారు. ఈ నెల 15న థియేటర్స్ సినిమాచూసి ఆనందించండని తారక్ అన్నారు.