దర్భార్ : రజనీ ఎంట్రీ సీన్ లీకు

థియేటర్స్ లో సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘దర్భార్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రీమియర్, బెనిఫిట్ షోస్ పడిపోయాయి. అభిమానులు సోషల్ మీడియా వేదిక దర్భార్ టాక్ ని పంచుకొంటున్నారు. అదే సమయంలో థియేటర్ నుంచి కొన్ని సన్నివేశాలని లీక్ చేస్తున్నారు.

సినిమాలో రజనీ ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలని అభిమానులు సెల్ ఫోన్స్ బంధించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అభిమానం పేరుతో అభిమాన హీరో సినిమాకి డ్యామేజ్ చేస్తున్నారు. ఇక రజనీ ఎంట్రీ సీన్ అదిరిపోయింది. పోలీస్ డ్రెస్ లో విలన్ లని తనదైన శైలిలో రఫ్పాడించే సీన్ అది. ఆ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్ లో ఏ ఒక్కరు సీట్లలో కూర్చొని లేరు. దటీజ్.. రజనీ.. !