వీడియో చూస్తే.. మహేష్ అభిమానులకి కడుపునిండిపోద్ది !

సంక్రాంతికి అభిమానులని ఓ రేంజ్ లో నవ్వించాలని సూపర్ స్టార్ మహేష్ ఫిక్సయినట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ వారమే (జనవరి 11) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సరిలేరు చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

మరోవైపు ప్రమోషన్స్ వీడియో పేరిట మేకింగ్ వీడియోలని వదులుతున్నారు.అవి అభిమానుల కడుపుని నింపేస్తున్నాయి. తాజాగా వైబ్ పేరిట ఓ మేకింగ్ వీడియోని వదిలింది చిత్రబృందం. షూటింగ్ సమయంలో ఫన్నీ సీన్స్ అన్నీ జోడించి.. ఈ వీడియోని వదిలినట్టు తెలుస్తోంది. షూటింగ్ చేస్తూనే చిత్రబృందం పగలబడి నవ్వుకొంది. ప్రత్యేకంగా మహేష్.. షూటింగ్ సమయంలో ఆయన ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారన్నదానికి ఇదో సాక్ష్యం. ఆ వీడియోని చూస్తే.. మహెష్ అభిమానుల కడుపునిండిపోవడం ఖాయం. మరీ.. ఆలస్యం ఎందుకు చూసేయండీ.. !