మీకు అర్థమవుతోందా.. ? బొమ్మ బ్లాక్ బస్టర్ !

టాలీవుడ్ లో తొలి సంక్రాంతి పుంజుగా సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా సరిలేరు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శుక్రవారం రాత్రి నుంచే ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. సినిమా టాక్ ని ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

సినిమాని దేశభక్తి మొదలెట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపించే ఏపీసోడ్ తో మొదలైన సినిమా.. మెల్లగా కథలోకి వెళ్తుంది. ఆర్మీ ఏపీసోడ్, సరిలేరు ఆథమ్ వెంట్రుకలు నిక్కబొడిచేలా ఉందని చెబుతున్నారు. ఇక ఫస్టాఫ్ మొత్తం కితకితలు పెట్టాడు. ట్రయిన్ ఏపీసోడ్ కడుపుబ్బ నవ్విస్తుంది. సెకాంఢాప్ లో మాత్రంలో మహేష్-విజయశాంతిల మధ్య వచ్చే ఏమోషనల్ సీన్స్.. ఆర్మీ గొప్పదనం గురించి విజయశాంతి చెప్పే సీన్స్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు.

మొత్తానికి.. మాస్ ఎంటర్ టైనర్ లో మహేష్ అదరగొట్టేశాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ పండిన సినిమా అని చెబుతున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అని తేల్చేస్తున్నారు. సినిమా చేసేటప్పుడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై ఒత్తిడి ఉందని చెప్పుకొన్నారు. ఎందుకంటే.. ? సంక్రాంతికి పోటీలో ఉన్న అల.. వైకుంఠపురంలో సినిమా పాటలు అద్భుతంగా ఉండటమే. కానీ, ఆ ఒత్తిడిని దేవి చిత్తు చేశారు. కథ తగ్గ పాటలు ఇచ్చారు. ఇక నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడు. సినిమా స్థాయిని పెంచే నేపథ్య సంగీతం అందించారు. మొత్తానికి.. ఫస్ట్ షోతే సరిలేరు బ్లాక్ బస్టర్ అని తేలిపోయింది. ఇక మిగిలింది.. ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయా ? అన్నదే మిగిలి ఉంది.