బన్నీ దృష్టిలో టాలీవుడ్ టాప్-3 వీరే.. !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’ సంక్రాంతి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కిన ఈ హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలని అందుకొనేలా అల.. పాటలు, టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఆసక్తికర విషయాలు పంచుకొన్నారు.

టాలీవుడ్ లో ముగ్గురు ప్రధానమైన హీరోలు ఎవరు ? అన్న ప్రశ్నకి సమాధానంగా బన్నీ.. సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి ప్రభాస్ పేర్లు చెప్పారు. ఈ తరం హీరోల్లో ప్రభాస్ పేరు చెప్పడం. అది కూడా బాహుబలి నుంచి అని ప్రస్తావించారు. సో.. నేటి తరం హీరోల్లో టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అని అల్లు అర్జున్ అభిప్రాయమని భావించాలి.