అల. సూపర్ హిట్ సీన్స్ లీకు !
అభిమానం పేరిట అభిమాన హీరో సినిమాని డ్యామేజ్ చేయడం అంటే ఇదే. త్రివిక్రమ్-అల్లుఅర్జున్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. అల.. టాక్ బయటికొచ్చింది. సూపర్ హిట్ అని ప్రేక్షకులు తేల్చేశారు.
బన్నీ, త్రివిక్రమ్ ఫ్యాన్స్ బెనిఫిట్ షోస్ తోనే అల.. ని చూసేశారు. సినిమాని ఎంజాయ్ చేశారు. ఐతే, అభిమానులు చేసిన పనులు సినిమాని డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. అల.. సూపర్ సీన్స్ బిట్స్ ని థియేటర్ లో మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇలా.. సినిమాలో బన్నీ ఎంట్రీ సీన్స్, సెకాంఢాఫ్ లో హైలైట్ సీన్ గా చెబుతున్న ఆఫీస్ బిట్ సీన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ప్రీ క్లైమాక్స్ సీన్ కూడా బయటికొచ్చింది.
వీటితోపాటు కొన్ని సాంగ్స్ కి సంబంధించిన బిట్ సీన్స్ ని లీక్ చేస్తున్నారు. ఇది అభిమానం పేరుతో అభిమాన హీరో సినిమాని డ్యామేజ్ చేయడమే. ఈ విషయంలో బన్నీ అభిమానులు కాస్త ఆలోచిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ? హైలైట్ సీన్స్ ముందే చూసిన వారు థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే.. అంతలా ఎంజాయ్ చేయకపోవచ్చు. ఆ ఫీల్, ఆ సస్పెన్స్ అనేది మిస్సవుద్ది. అందుకే ఎంత అభిమానం ఉన్నా.. దాన్ని లీకుల ద్వారా చూపించకపోవడమే మంచిదేమో !
Makkkii
Response
#AlaVaikunthapurramloo pic.twitter.com/kwFukKpYtx
— KICK Tollywood (@KickTwood) January 12, 2020
Show time : #AlaVaikunthapurramloo pic.twitter.com/6Ktpkj43rx
— Oopikaa ledhu (@NarasimhaAa5) January 12, 2020
Show Time
#AlaVaikunthapurramloo
pic.twitter.com/1Kd65iCYyX
— Wolverine (@SharanRebel) January 12, 2020
Follow..Follow…U
#AlaVaikunthapurramloo pic.twitter.com/eaqAUiguSB
— RakeshTarak (@RakeshTarak_15) January 12, 2020