మహేష్’పై బన్నీదే పైచేయి

సంక్రాంతి సినిమాల మధ్య పోటీ, పోలికలు సహజమే. సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురంలో సంక్రాంతి సినిమాలుగా ఫిక్సయినప్పటి నుంచి ఈ రెండు సినిమాల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఫస్ట్ లుక్ నుంచే పోలికలు మొదలయ్యాయి. పాటల, పోస్టర్స్,  టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ వీడియోలు.. ఇలా ప్రతి విషయంలోనూ పోల్చీ చూశారు. ఐతే, రిలీజ్ ముందు మాత్రం అల.. దే పైచేయి అనిపించింది. ఎందుకంటే ? అల.. పాటలు ఆ రేంజ్ లో ఉన్నాయి. సరికొత్త రికార్డులని సృష్టించాయి.

సరిలేరు పాటలు బాగున్నా… అల.. రేంజ్ కనిపించలేదు. ఈ నేపథ్యంలో రిలీజ్ కి ముందు ఎవరి హవా కొనసాగింది అన్నది కాదు. రిలీజ్ తర్వాత అసలు సిసలు సంక్రాంతి విజేతగా ఎవరు నిలిచారన్నదే ముఖ్యమని మహేష్ ఫ్యాన్స్ చెప్పుకొన్నారు. ఇప్పుడు రెండు సంక్రాంతి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయ్. శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు నీకెవ్వరు హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఆ రేంజ్ లోనే ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేశాయ్.

ఇక ఈరోజు అల.. వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి మహేష్, బన్నీ ఇద్దరు హిట్ అయ్యారు. మరీ.. వీరిలో ఎవరిది పై చేయి అంటే మాత్రం అల్లు అర్జున్ దే అంటున్నారు. ఎందుకంటే.. ? అల.. ఆ రేంజ్ లో ఉంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇది ఫ్యాన్స్ మాట మాత్రమే. ఇలాంటి పోటీ, పోలీకలు స్టార్స్ పట్టించుకోరు. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు.