సంధ్యలో సందడి చేసిన బన్నీ

టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్ లలో ఎవరు సంక్రాంతి విజేతగా నిలుస్తారనే ఉత్కంఠకి తెరపడింది. సంక్రాంతి కానుకగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ టాక్ సొంతం చేసుకొంది. వినోదం, ఎమోషన్ పడిన సరిలేరుని హిట్ గా తేల్చేశారు ప్రేక్షకులు. దీంతో బ్లాక్ బస్టర్ హిట్ సెలబ్రేషన్స్ మొదలెట్టేసింది సరిలేరు చిత్రబృందం. శనివారం మధ్యాహ్నం నుంచే సరిలేరు సెలబ్రేషన్స్ మొదలైపోయాయ్.

ఇక ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ హిట్ టాక్ సొంతం చేసుకొంది. అంతేకాదు.. అల.. అసలు సిసలు సంక్రాంతి సినిమా. సంక్రాంతి విజేత అని చెప్పుకొంటున్నారు. ఎందుకంటే ? సరిలేరు సినిమా విషయంలో కొన్ని నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. కొంతమంది సరిలేరు యావరేజ్ అని చెప్పుకొన్నారు. కానీ, అల.. రివ్యూస్ వన్స్ సైడ్ రివ్యూస్.. బ్లాక్ బస్టర్ హిట్టు. ఈ నేపథ్యంలో.. అల.. సంక్రాంతి విజేత అని చెప్పుకొంటున్నారు. చాలామంది మాత్రం మహేష్, బన్నీ ఇద్దరు గెలిచారు. సరిలేరు, అల.. రెండు సినిమాలు బాగున్నాయని చెబుతున్నారు.

ఈ విషయం పక్కనపెడితే.. ఈ ఉదయం బన్నీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్స్ లో సందడి చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూశారు. బన్నీ థియేటర్ కి వెళ్లిన సమయంలో.. అభిమానులు చేసిన హంగామా.. అంతా ఇంతా కాదు. బ్యాక్ టీషర్ట్ వెనకాల అల.. వైకుంఠపురంలో లోగోతో బన్నీ థియేటర్ లో సందడి చేశారు.