ఆ పని చేశానని నిరూపించండీ.. 30ఇయర్స్ పృధ్వీ సవాల్ !

ఆడియో టేపుల వ్యవహారంలో నటుడు, వైకాపా నేత పృధ్వీ రాజ్ పదవి వీడింది. ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై పార్టీ హైకమాండ్ కావడంతో పృధ్వీ రాజీనామా చేయక తప్పలేదు. ఇక రాజీనామా తర్వాత మీడియా మాట్లాడిన పృధ్వీ తనని కావాలనే ఇలాంటి వ్యవహరంలో ఇరికించారనే ఆరోపణలు చేశారు. 

ఫేక్ వాయిస్ పెట్టి తనను అప్రతిష్టపాలు చేశారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు తీవ్రంగా బాధపడుతున్నానన్నారు. తాను పద్మావతి గెస్ట్ హౌస్ లో కూర్చొని మందు తాగానని మాట్లాడుతున్నారు. ఎటువంటి వైద్య పరీక్షలకైనా తాను సిద్దం. తాను మద్యం తాగినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆడియో టేపుల వ్యవహారం ఒక్కటే.. పృధ్వీరాజ్ పదవి పోగొట్టలేదు.

అంతకుముందు పృధ్వీరాజ్ ఆందోళనలు చేస్తున్న రాజధాని రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అనడం వివాదాస్పదం అయింది. అంతేకాదు.. మాజీ సీఎం చంద్రబాబు కమ్మ వర్గకోసం పాకులాడుతున్నారనే మాటలు మాట్లాడారు. అది సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న సీఎం జగన్.. పృధ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.