బ్రేకింగ్ : ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వి రాజీనామా

ఊహించినట్టుగానే ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వి పై వేటు పడింది. ఆడియో టేపుల వ్యవహారాన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పృధ్వీపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించడంతో.. ఈ మేరకు పృధ్వీకి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొద్దిసేపటి క్రితమే పృధ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పృధ్వీ తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఫేక్ వాయిస్ పెట్టి తనను అప్రతిష్టపాలు చేశారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు తీవ్రంగా బాధపడుతున్నానన్నారు. తాను పద్మావతి గెస్ట్ హౌస్ లో కూర్చొని మందు తాగానని మాట్లాడుతున్నారు. ఎటువంటి వైద్య పరీక్షలకైనా తాను సిద్దం. తాను మద్యం తాగినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. రాజధాని రైతులందరినీ తాను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదని, కార్పొరేట్ రైతుల గురించే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు.