అల.. పార్టీ టైం !

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలిసి మరోసారి ప్రేక్షకులని ఫిదా చేశారు. వీరి కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకొంది. సంక్రాంతి విజేత అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అల.. చిత్రబృందం సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది.

ఆదివారం మధ్యాహ్నం నుంచే అల.. సెలబ్రేషన్స్ మొదలైపోయాయ్. హిట్ కిక్కులో బన్నీకేక్ కట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ నోరు తీపిచేసి.. ఆయన్ని గట్టిగా ఆలింగనం చేసుకొన్నాడు. హిట్ ఇచ్చినందుకు ఇంతకంటే పెద్ద బహుమతి ఏముంటుంది ? అన్నట్టుగా బన్నీ త్రివిక్రమ్ ని ఆలింగనం చేసుకొన్నారు. ఇక ఆదివారం రాత్రి అల.. సెలబ్రేషన్స్ పీక్స్ చేరిపోయాయ్.

సెలబ్రేషన్స్ ఎక్కడ, ఏ స్టార్ హోటల్ లో అనేది ఫర్ ఫెక్ట్ గా తెలీదు. కానీ, పార్టీ కలర్ ఫుల్లుగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలని హీరోయిన్ పూజా హెగ్డే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో త్రివిక్రమ్, బన్నీ, మురళీశర్మ, సుశాంత్, అల్లు అరవింద్.. తదితరల మొహాలు హిట్ కొట్టామని ఆనందంతో వెలిగిపోతున్నాయ్.