ఎన్టీఆర్, ప్రభాస్’తో త్రివిక్రమ్ సినిమా

ఓ సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా ప్రకటన చేయడం దర్శకుడు త్రివిక్రమ్’కు అలవాటు. ఆయన దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురంలో’ సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి విజేతగా నిలిచింది. ప్రసుతం అల.. చిత్రబృందం సంక్రాంతి విన్నర్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంది.

మరోవైపు త్రివిక్రమ్ తదుపరి సినిమా ఇదే అంటూ వార్తలు జోరందుకున్నాయి. ఆయన నెక్ట్స్ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉండనుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా తీసుకొచ్చే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు చెప్పుకొంటున్నారు. తాజాగా తారక్-త్రివిక్రమ్ సినిమాపై మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ సినిమాని కల్యాణ్ రామ్ నిర్మించనున్నారట. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ తో కలిసి కల్యాణ్ రామ్ తారక్-త్రివిక్రమ్ సినిమాని నిర్మించబోతున్నట్టు లెటెస్ సమాచారమ్. ఇక త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. బహుశా… ముందు ఎన్ టీఆర్ ఆ తర్వాత ప్రభాస్ తోనూ త్రివిక్రమ్ సినిమాలు చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.