మనీష్ పాండే స్టన్నింగ్ క్యాచ్ చూశారా ?
టీమిండియా యువ బ్యాట్స్ మెన్ మనీష్ పాండే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ పట్టాడు. రాజ్ కోట్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 96 పరుగులతో మరోసారి తన మార్క్ చూపించాడు.కోహ్లీ 78, కేఎల్ రాహుల్ 80, రోహిత్ శర్మ 42పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, కేన్ రిచర్డ్సన్ 2 వికెట్లు తీశారు.
341 పరుగులు భారీ లక్ష్యమే. కానీ, మంచి ఫామ్ లో ఉన్న ఆసీస్ బ్యాట్స్ మెన్స్ కి ఇది చేధించే టార్గెట్ నే. ముఖ్యంగా భీకర ఫామ్ లో ఉన్న ఓపెనర్ వార్నర్. కానీ, మనీష్ పాండే వార్నర్ కి ఆ అవకాశం ఇవ్వలేదు. రెండు ఫోర్స్ కొట్టి మంచి ఊపులోకి వచ్చిన వార్నర్ ని కళ్లు చెదిరే క్యాచ్ చెదిరే క్యాచ్ తో పెలివియన్ కి పంపించాడు మనీష్ పాండే. షమీ బౌలింగ్ లో మనీష్ పాండే అందుకున్న క్యాన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేదే. ఆ క్యాచ్ ని మీరు చూడండీ.. !
ప్రస్తుతం ఆసీస్ నిలకడగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో ఫించ్ (23), స్మిత్ (20) ఉన్నారు.
What a catch by manish pandey……..😳😍😍#ind_vs_aus #manishpandey pic.twitter.com/jm7N4CNEWd
— 🚩🚩Shreya$💙🚩🚩 (@hreya15) January 17, 2020