రెండ్రోజుల ముందే ఏపీ కేబినేట్ భేటీ.. ఎందుకంటే ?

ఈ నెల 20న జరగాల్సిన ఏపీ కేబినేట్ భేటీ రెండ్రోజుల ముందుగానే అంటే రేపు (జనవరి 18)నే జరగనుంది. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఏపీ రాజధాని విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారమ్. పరిపాలన వికేంద్రీకరణ, ఏపీ సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ నివేదికలపై పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

హైపర్ కమిటీ కూడా పనిని పూర్తి చేసింది. పలు దఫాలుగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. కేబినెట్ భేటీకి ముందే ఆ కమిటీ తమ నివేదికను సీఎం జగన్ కు అందించే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో పలు అంశాలతో పాటు హైపవ కమిటీ నివేదికపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజధానిపై కేబినేట్ స్పష్టమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇక ఈ నెల 20నుంచి మూడ్రోజుల పాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ రాజధాని అంశంపై చర్చింది.. ప్రకటన చేయనున్నారు.