ధోనికి బిగ్ షాక్ 

బీసీసీఐ భారత జట్టు ఆటగాళ్ల వార్షిక ఒప్పందాల్ని గురువారం ప్రకటించింది. ఈ జాబితాను బీసీసీఐ నాలుగు విభాగాలుగా విభజించింది. గ్రేడ్‌ ఎ ప్లస్‌, గ్రేడ్‌ ఎ, గ్రేడ్‌ బీ, గ్రేడ్‌ సీ మొత్తం నాలుగు విభాగాలుగా కేటాయించింది. అక్టోబర్‌ 19 నుంచి మొదలైన ఈ ఒప్పందం సెప్టెంబర్‌ 2020 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.

వార్షిక ఒప్పందంలో భాగంగా గ్రేడ్‌ ఎ ప్లస్‌ ఆటగాళ్లకు 7కోట్ల రూపాయలు, గ్రేడ్‌ ఎ ఆటగాళ్లకి 5కోట్ల రూపాయలు అదేవిధంగా గ్రేడ్‌ బీ విభాగంలో ఉన్నవారికి 3కోట్లు, గ్రేడ్‌ సీ విభాగంలో ఉన్నవారికి ఒక కోటి చొప్పున ఆదాయాన్ని చెల్లించనున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. అయితే ఈ జాబితాలో గత ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ ఓటమి నుంచి ఆడని భారత మాజీ కెప్టెన్‌ ధోనీకి చోటు దక్కలేదు. ఎ కేటగిరిలో ఉండే 38ఏళ్ల ధోనీకి గత సంవత్సరం వరకు రూ.5కోట్లు వార్షిక ఆదాయాన్ని బీసీసీఐ చెల్లించేది. జులై 9న జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ నుంచి ధోనీ కాంట్రాక్ట్‌ పునరుద్ధరించలేదు.