అమీర్ కూతురు పబ్లిక్ గానే !
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ చాలా ఓపెన్. పర్సనల్ విషయాలని పబ్లిక్ కి తెసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది. మ్యూజిక్ కంపోజర్ మిషాల్ కృపలానీతో ఇరాఖాన్ ప్రేమలో ఉన్న విషయాన్ని తెలిసేలా.. అతడి సన్నిహితంగా ఉండే ఫోటోలని పంచుకుంది. అవి వైరల్ అయ్యాయి. తాజాగా మీరెవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారా అని ఓ నెటిజన్ ప్రశ్నకు ఓపెన్ గా సమాధానం ఇచ్చింది ఇరాఖాన్.
మిషాల్ను హత్తుకుని ఉన్న ఫొటోను ఇరా షేర్ చేసింది. అంతేకాదు.. “నేను ఏదీ దాయాలని ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో నాకు నచ్చిన పోస్టులు పెడతాను. ఫొటోలు షేర్ చేస్తాను. నేను ఏంటీ అనే నిజాన్ని ప్రతిబింబించేలా నా పోస్టులు ఉంటాయి” అని ప్రేమ విషయాన్ని పబ్లిక్ గానే చెప్పేసింది. ప్రేమ వ్యవహారం ఒక్కటే కాదు.. ఇరాఖాన్ హాట్ హాట్ ఫోటో షూట్స్ లో రెచ్చిపోతుంటుంది.