కంగనా కోరిక తీరింది

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పదేళ్ల కోరిక. ముంబైలో సొంత స్టూడియోని నిర్మించాలని. ఇప్పుడు కంగనా కల తీరింది. ముంబైలోని పాలి హిల్‌ ప్రాంతంలో తన ఫిల్మ్‌ స్టూడియోను కంగనా ప్రారంభించింది. మణికర్ణిక ఫిల్మ్స్‌ పేరిట ఏర్పాటు చేసిన ఈ స్టూడియోలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పూజ నిర్వహించింది. ఈ స్టూడియో కేంద్రంగా ఆమె దర్శక నిర్మాతగా వ్యవహరించనుంది. 

కంగనా స్టూడియోను ఇవాళ ప్రారంభించామని, స్టూడియో వ్యవహారాలను న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఫిల్మ్‌ ప్రొడక్షన్‌లో శిక్షణ పొందిన అక్షత్‌ పర్యవేక్షిస్తారని కంగనా సోదరి రంగోలి  తెలిపింది. లాంఛింగ్‌ ఫోటోలను షేర్ చేసింది. నిజాయితీతో కష్టపడి పనిచేస్తే ప్రజలు ఏదైనా సాధించవచ్చని దాని కోసం చిల్లరమల్లర పనులు చేస్తూ నిజాయితీ లేకుండా ఎందుకు వ్యవహరించాలనిసెటైర్లు కూడా వేసింది.