నిర్భయ దోషుల ఉరి కొత్త తేది ఖరారు
నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరిశిక్షకు కొత్త తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు డెత్ వారెంట్ జారీ అయింది. ఢిల్లీలోని తీహార్ జైల్లో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు.
వాస్తవానికి ఈ నెల 22నే నిర్భ దోషులకి ఉరిశిక్షని అమలు చేయాల్సి ఉంది. ఐతే, నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉన్న విషయం వెలుగులోకి రావడంతో.. దాన్ని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి పంపించడం.. ఆయన క్షమాభిక్షని తిరస్కరించడం జెడ్ స్పీడుతో జరిగిపోయాయ్. క్షమాభిక్షను నిరాకరించిన పక్షంలో చట్టం ప్రకారం ఉరిశిక్ష విధించడానికి రెండు వారాల గడువు ఉండాలి. ఈ నేపథ్యంలో చట్టం ప్రకారం సరిగ్గా ఈ రోజు నుంచి 14వ రోజున (ఫిబ్రవరి1) ఉరిశిక్షను అమలు చేయబోతున్నారు.