ప్రభాస్ ప్రేమకథ.. ఫస్ట్ లుక్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ‘జిల్’ ఫేమ్ రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదో ప్రేమకథా చిత్రం. పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ సినిమా ఇదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి పిక్కు, లుక్కూ రాలేదు. ఆ లోటుని తీరుస్తూ.. ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని తెలిపారు.

యూరప్ నేపథ్యంలో తెరకెక్కించాలనుకొన్న కొన్ని సన్నివేశాలనే ఇక్కడే సెట్స్ వేశారు. ఆ సెట్ లోనే తదుపరి సినిమా షూటింగ్ మొదలు కానుంది. సెట్ ని తీక్షణంగా చూస్తున్న ఫోటోని ప్రభాస్ అభిమానుల కోసం షేర్ చేశారు. దీంతో.. ఇదే ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ గా అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.