బ్రేకింగ్ : మూడు రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సుధీర్ణ చర్చ అనంతరం సభ బిల్లుని ఆమోదించింది. సీఎం జగన్ సుధీర్ణ ప్రసంగం అనంతరం మూడు రాజధానుల బిల్లుని సభలో ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం తెలిపింది. విశాఖని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తూ బిల్లుని రూపొందించారు.
అంతకుముందు సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీకి మూడు రాజధానులని ఎందుకు ఏర్పాటు చేయాల్సిందనే విషయాన్ని వివరించారు. ఆర్థిక పరిస్థితులు, అనుకూలతని వివరించారు. అమరావతి, వైజాగ్ లలో రాజధాని అభివృద్ది గురించి వివరించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ఖర్చు చేసే దాంట్లో పది శాతం ఖర్చు చేస్తే.. వైజాగ్ ఐదు, పదేళ్లలో హైదరాబాద్ ని అందుకుంటుందని తెలిపారు.
రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, చారిత్రక ఒప్పందాలను గౌరవిస్తూ.. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు బిల్లును ప్రవేశపెడుతున్నాం- సీఎం వైయస్ జగన్ #APAssembly#ISupport3Capitals #APThanksYSJagan pic.twitter.com/dxlaLmENRF
— YSR Congress Party (@YSRCParty) January 20, 2020