సీఎం జగన్ విజువల్స్’తో కొట్టారు

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై వాడివేడి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం జగన్ మాట్లాడుతున్నారు. రాజధాని విషయంలో గత ప్రభుత్వం చేసిన కుట్రలు, శివ రామకృష్ణ కమిటీ ఏం చెప్పింది. ఎందుకు ఏపీకి మూడు రాజధానులని ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే విషయాలని సీఎం జగన్ సవివరంగా వివరిస్తున్నారు.

కేవలం వివరణ మాత్రమే కాదు. ఈజీగా అర్థమయ్యేలా విజువల్ రూపంలో వివరిస్తున్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పిందో సీఎం జగన్‌ వీడియో క్లిప్‌ ప్రదర్శించారు. అభివృద్ధి ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకృతం కాకూడదని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందన్నారు. జీఎన్‌రావు, బోస్టన్‌ రిపోర్టులు అభివృద్ధి వికేంద్రీకరణకు ఓటు వేశాయన్నారు.
 
అంతేకాదు.. రాజధానికి వెళ్లే రోడ్ల క్లిప్ లని ప్రదర్శించారు. ఒకవాహనం వెఌతే.. మరో వాహనం వెళ్లరాని పరిస్థితి అని తెలిపారు. రాజధాని అంశంపై గతంలో న్యూస్ పేపర్లు, ముఖ్యంఘా ఈనాడు, ఈ టీవీల్లో వచ్చిన కథనాలనే చూపుతూ తెదేపాపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని కోసం 4 నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని అప్పట్లో చంద్రబాబు అన్న మాటలని వీడియో క్లిప్ లని వేసి చూపించారు. మొత్తంగా.. అరటిపండు ఒలచి నోట్లో పెట్టినట్టు సీఎం జగన్ ప్రసంగం సాగుతోంది.