ఇన్నాళ్లకు డీఎస్ పశ్ఛాతాపం

సీనియర్ నేత డి. శ్రీనివాస్ సాంకేతికంగా గులాభి నేత. కానీ, ఆయన తెరాసలో లేరు. కారులో తిరగడం లేదు. డీఎస్ ని సస్పెండ్ చేయాలని చూసిన తెరాస.. దాన్ని పెండింగ్ లో పెట్టేసింది. పార్టీ గెంటేసే దాక చూస్తాననే ధోరణిలో డీఎస్ ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన డీఎస్.. తాను కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశానని అన్నారు. దిగ్విజయ్‌సింగ్‌ నాపై సోనియాకు తప్పుడు నివేదిక ఇవ్వడం వల్లే మనస్తాపంతో కాంగ్రెస్‌ పార్టీని వీడానన్నారు.
 
ఇక మంత్రి ప్రశాంతిరెడ్డి తలతిక్కమాటలు మానుకోవాలన్నారు. తాను చేసింది తప్పని నిరూపిస్తే పార్టీ నుండి సస్పెండ్‌ చేయండి అని పేర్కొన్నారు. మరోవైపు, బీజేపీలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆయన కొడుకు అరవింద్ నిజమాబాద్ బీజేపీగా ఎంపీగా ఉన్నారు. ఐతే, డీఎస్ తాజా వ్యాఖ్యలని బట్టీ చూస్తే.. ఆయన సొంతగూడు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నట్టు కనిపిస్తోంది. మరీ.. ఫైనల్ గా డీఎస్ ఏ పార్టీలో చేరుతారు ? అన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.