టెస్టుల్లో కేశవ్‌ మహారాజ్‌ కొత్త రికార్డు

దక్షిణాఫ్రికా స్పిన్‌ బౌలర్‌ కేశవ్‌ మహారాజ్‌ బ్యాట్ రులిపించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌  82వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న మహారాజ్‌.. జోరూట్‌కు చుక్కలు చూపించాడు. తొలి మూడు బంతులను బౌండరీలు బాదిన అతడు, తర్వాతి రెండు బంతులను సిక్సులుగా మలిచాడు. చివరి బంతి లెగ్‌బైస్‌గా వెళ్లడంతో మరో నాలుగు పరుగులు లభించాయి. ఈ ఓవర్‌లో మొత్తం 28 పరుగులు వచ్చాయి.

2003-04 సీజన్‌లో విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రయన్‌లారా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో తొలిసారి 28 పరుగులు సాధించాడు. రాబిన్‌ పీటర్సన్‌ వేసిన ఆ ఓవర్‌లో లారా (4 6 6 4 4 4 ) చితక్కొట్టాడు. 2013-14 సీజన్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ జార్జ్‌ బెయిలీ ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులు చేశాడు. జేమ్స్‌ ఆండర్స్‌ బౌలింగ్‌లో.. బెయిలీ (6 2 4 6 6 4) బ్యాట్‌ ఝుళిపించాడు. తాజాగా మహారాజ్‌.. రూట్‌ బౌలింగ్‌లో(4 4 4 6 6 బైస్‌4) విరుచుకుపడ్డాడు.