చంద్రబాబు అరెస్ట్

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. మూడు రాజధానుల బిల్లుపై వాడివేడి చర్చజరుగుతున్న క్రమంలో తెదేపాకి చెందిన 17మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కి గురయ్యారు. బయటికొచ్చాక.. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్రగా మందడం బయల్దేరారు. వారి పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. పాదయాత్రను అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్ కి తీసుకెళ్లారు.
 
మరోవైపు, మూడు రాజధానుల బిల్లుకి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో..  విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా ఏర్పాటు అయ్యాయి. బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. అమరావతి రాజధానిని మార్చడం లేదని.. అదనంగా మరో రెండు రాజధానులని మాత్రమే ఏర్పాటు చేశామన్నారు.