అదా శర్మ.. మిర్చిలాంటి అందాలు !

సినిమాలు తక్కువ.. ఫోటో షూట్స్ ఎక్కువ అన్నట్టుగా ఉంది పొడుగుకాళ్ల సుందరి అదాశర్మ పరిస్థితి. సినిమాల్లేకపోయినా.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అభిమానులతో టచ్ లో ఉంటుంది.. ఈ ముద్దుగుమ్మ. తాజాగా రెడ్ డ్రెస్ లో అదా ఇచ్చిన పోజులు కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. అసలే హార్ట్ ఎటాక్ తెప్పించే అందాలు.. వాటిని రెడ్ డ్రెస్ లో వడ్డించేసింది అదా. వాటికి సింబల్ గా మిర్చి సింబల్స్ ని పెట్టింది. మిర్చిలాంటి అందాలు.. చూసి ఎంజాయ్ చేయండని అన్నట్టుగా సైగలు చేస్తుందన్న మాట. 

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో అదాకి అవకాశాల్లేవ్. ఆమె నటించిన ఆఖరి చిత్రం కల్కీ. ఇందులో రాజశేఖర్ భార్యగా కనిపించింది. బాలీవుడ్ లో ఆమె నటించిన కమాండ్ 3 గత యేడాది చివరలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ మోస్తరుగా ఆడింది. ప్రస్తుతం సినిమాల్లేని అదా.. ఫోటో షూట్స్ తో సరిపెట్టుకుంటోంది. ఎవరైనా అవకాశాలు ఇస్తే మాత్రం.. హాట్ హాట్ గా అందాల ఆరబోతకి రెడీ అన్నట్టుగా ఫోటో షూట్స్ తో సంకేతాలిస్తోంది. మరీ.. అదా అందాలని వాడుకొనేందుకు ఏ దర్శకుడు ముందుకొస్తాడనేది చూడాలి.