వయసు మీదున్నప్పుడే.. ఆ పనులు చేయాలి !

వయసు మీదున్నప్పుడే ఆ పనులు చేయాలి. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు అంటోంది యంగ్ హీరోయిన్ అనుపమ పమేశ్వరన్. ఈ ముద్దుగుమ్మ చేస్తున్న సినిమాలన్నీ ప్రేమకథలే. దీంతో అన్నీ ప్రేమకథలేనా ? అంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు. దానికి అనుపమ ఆసక్తికర సమాధానం చెప్పింది.
 
“ఇప్పటి వరకూ ప్రేమకథలే చేశాను. అయినా బోర్ కొట్టడం లేదు. పైగా వాటిని బాగా ఆస్వాదిస్తున్నాను. నిజ జీవితంలో ప్రేమలో పడలేదు కాబట్టి, ప్రేమ ఎలా ఉంటుందో, అందులో ఉండే అనుభూతులేంటో సినిమాల ద్వారా, నా పాత్రల ద్వారా తెలుసుకుంటున్నాను. ఇదో మంచి అనుభవం. కొన్నాళ్లకు ఎలాగూ వయసైపోతుంది. అప్పుడు బరువైన పాత్రలు వస్తాయి. ప్రేమకథల్లో చేయాలనుకున్నా, అవకాశం ఉండదు. అందుకే యవ్వనాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఆస్వాదిస్తున్నా”నని అనుపమ చెప్పుకొచ్చింది.