డిస్కోరాజా :  #FreakOut వీడియో సాంగ్

వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. నభా నటాషా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. బాబీ సింహా కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు. ఈ వారమే (జనవరి 24) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకున్నాడు డిస్కోరాజా. యు/ఎ సర్టిఫికెట్ పొందాడు.

తాజాగా ఈ సినిమా నుంచి #FreakOut వీడియో సాంగ్  ని విడుదల చేశారు. ఈ పాటని స్వయంగా రవితేజ పాడారు. థమన్ సంగీతం అందించారు. రవితేజ ఎనర్జిని ఈ సాంగ్ లో చూడొచ్చు. అంతేకాదు.. ఈ పాటలో రవితేజ, అతని స్నేహితుల బ్యాచ్, విలన్ బాబీ సింహాలని డిఫరెంట్ గెటప్ లలో చూడొచ్చు.  #FreakOut వీడియో సాంగ్ ని మీరు చూసేయండీ.. !