క్రిష్-పవన్ సినిమా ఈ నెలలోనే ప్రారంభం !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పింక్ తెలుగు రిమేక్ లో నటిస్తున్నారు. సోమవారమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. తొలిరోజే షూటింగ్ స్పాట్ నుంచి పవన్ పిక్స్ బయటికొచ్చాయ్. వైరల్ అయ్యాయ్. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.
 
పింక్ రిమేక్ మొదలైన వారం గ్యాప్ లోనే పవన్ మరో సినిమాని కూడా మొదలు పెట్టబోతున్నారు. క్రిష్-దర్శకత్వంలో పవన్ సినిమా ఓకే అయింది. ఈ చిత్రాన్ని ఎంఏ రత్నం నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఈ నెల 27నుంచి ప్రారంభం కానుంది. ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్స్ లో పవన్ పాల్గొననున్నారు. పింక్ రిమేక్ కోసం కేవలం 20 రోజుల కాల్షీట్లు మాత్రమే పవన్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో క్రిష్ సినిమాకి ఆయన డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్-క్రిష్ సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.