దొంగ వేటు వేసిన వారికి రూ. 3వేలు !

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఒకట్రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఐతే, రంగారెడ్డి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ 8 వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్న యువకులు పట్టుబడటం హాట్ టాపిక్ గా మారింది. నకిలీ ఓటర్ కార్డులతో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఇద్దరిని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు చితకబాదారు.

దొంగ ఓట్లు వేసేందుకు వచ్చి పట్టుబడిన ఓ యువకుడు షాకింగ్ విషయాలు చెప్పాడు. ఒక్కో నకిలీ ఓటుకు రూ. 3వేల రూపాయలు ఇస్తానని మాట్లాడిన తెరాస నాయకుడు నాగార్జున… మొత్తం 70 దొంగ ఓట్లు వేయడానికి యువకులని రప్పించారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచే ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. మొత్తం 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12,843 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 53.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.