పశువులకు హెల్త్ కార్డులు
పశువులకు హెల్త్ కార్డులు అందిస్తామని ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేశారు. అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. క్రాప్ ఇన్సూరెన్స్, పశువులకు హెల్త్ కార్డులు అందిస్తామని సీఎం తెలిపారు. భూసార పరీక్షలు చేపడతామన్నారు. రైతు భరోసా కేంద్రాల నుంచే పంటల కొనుగోళ్లు ఉంటాయన్నారు.
మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పనిలేదన్నారు. రాబోయే ఖరీఫ్ నాటికి 11,154 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.రైతు భరోసా కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరిస్తారన్నారు. రైతులకు సలహాలు, సూచనలు అందిస్తారన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తామన్నారు. భూసార పరీక్షలు చేపడతామన్నారు.