లోకేష్ తుగ్లక్ కాదట

తెదేపా యువనేత నారా లోకేష్ పై పప్ప అనే ముద్రపడిపోయింది. ఆ ముద్రని చెరిపేసుకొనేందుకు లోకేష్ బాగానే కష్టపడుతున్నారనుకోండీ. తాను పప్పు అయితే సీఎం జగన్ గన్నేరు పప్పు అంటూ లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కనపెడితే.. ఏపీకి మూడు రాజధానుల బిల్లుపై మండలిలో చర్చ సందర్భంగా సీఎం జగన్ తుగ్లక్ అంటూ తెదేపా సభ్యులు అనడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.

 ముఖ్యమంత్రి జగన్ ను తుగ్లక్ అని సంబోధిస్తుండటం ఎంత వరకు సంస్కారమని ప్రశ్నించారు. తమకు సంస్కారం ఉండబట్టే మిమ్మల్ని లోకేశ్ అనే సంబోధిస్తున్నామని మంత్రి అవంతి అన్నారు. ఇక చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ.. అమెరికా, సింగపూర్, చైనా అన్నారని… తాము మాత్రం వెనుకబడిన ప్రాంతాల గురించే ఆలోచిస్తామని మంత్రి అవంతి అన్నారు. అమరావతిలో టీడీపీ నేతలు చేసిన భూ దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. భీమిలిలో తనపై లోకేశ్ ను పోటీచేయించాలని భావించారని.. నాలుగు సర్వేలు కూడా చేయించారు. ఐతే, ఓడిపోతానని తెలిసి లోకేశ్ వెనక్కి తగ్గారని మంత్రి అవంతి చెప్పుకొచ్చారు.