‘నారప్ప’గా వెంకీ లుక్ చూశారా ?

తమిళ్ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ తెలుగు రిమేక్ లో వెంకీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘నారప్ప’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు నుంచే రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా నారప్పగా వెంకీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. నారప్పగా వెంకీ లుక్ అదిరిపోయింది. ఊరమాస్ లుక్ లో వెంకీ ఒదిగిపోయారు. కానీ, అచ్చుగుద్దినట్టు ‘అసురన్’లో ధనుష్ లుక్ ని దించేశారు. ఇంకా చెప్పాలంటే ధనుష్ లుక్ లోకి వెంకీ మారిపోయారు.

అసురన్ సినిమా చూసినోళ్లు, సినిమా చూడకున్నా.. అసురన్ లో ధనుష్ లుక్ ని చూసివాళ్లకి నారప్పగా వెంకీ కనబడటం లేదు. ధనుష్ ని కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసరున్ ని మక్కీకి మక్కీ తెలుగులో దించేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే నారప్ప బ్లాక్ బస్టర్ హిట్టయినట్టే. చేయాల్సిందల్లా ఒక్కటే తమిళ్ ఫ్లేవర్ కనిపించకుండా.. తెలుగుదనం అద్దడమే. ఈ చిత్రంలో వెంకీకి జంటగా ప్రియమణి నటిస్తుంది. మంజు  వారియర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.