ఏపీ రాజధానిపై పవన్ ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో జరగనున్న బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఇప్పటికే భాజాపా-జనసేనలు కలిసి నడవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు భాజాపా-జనసేన కలిసి నడవనున్నాయి.
తాజా సమన్వయ కమిటీ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణని ఖరారు చేయనున్నాయి. ఇందులో ఏపీ రాజధాని విషయంలో ఏ స్టాండ్ తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. బయటికి కనిపించకపోయిన రాజధాని విషయంలో భాజాపా, జనసేనలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. బయటికి రాజధాని అంశాన్ని భాజాపా వ్యతిరేకిస్తున్నా.. లోపల కేంద్రం సాయంతోనే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జనసేన మాత్రం మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జరగనున్న బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీ రాజధానిపై ఏ స్టాండ్ తీసుకోనున్నారు. ఏ ఎఫెక్ట్ తో మూడు రాజధానుల ఏర్పాటు ఆగుతుందా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మండలి రద్దుకు సీఎం జగన్ ప్రభుత్వం మొగ్గుచూపితే.. అప్పుడు బంతి కేంద్రం కోర్టులోకి వెలుతుంది. అప్పుడు జనసేన-భాజాపా ఉమ్మడి ప్రణాఌక ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీలో జరగనున్న భాజాపా-జనసేన సమన్వయ కమిటీ మీటింగ్ ప్రాధాన్యతని సంతరించుకుంది.