బండ్ల పరువు తీసిన దర్శకుడు
పరిశ్రమకి దూరమైన నటుడు, బడా నిర్మాత బండ్ల గణేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రయిన్ సీన్ లో బండ్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఐతే, ఆ పాత్రపై బండ్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడట. దర్శకుడు అనిల్ రావిపూడిని తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నాడట. ఈ మధ్య ఎవరు బండ్లని కలిసినా.. వారి దగ్గర అనిల్ ప్రస్తావన తీసుకొచ్చి.. మరీ బూతులు తిడుతున్నాడట. దానికి కారణం.. సరిలేరులో బండ్ల పాత్రనే అని చెబుతున్నారు.
ఎందుకంటే.. ? సరిలేరు బండ్ల పాత్రని 90శాతం ఎడిటింగ్ లో లేపేశారట. సరిలేరు సినిమాలో బండ్ల పాత్ర చాలా దారుణంగా వుందన్న కామెంట్లు వినిపించాయి. దీంతో బండ్లగణేష్ చాలా డీలా పడిపోయాడు. ముఖ్యంగా చుట్టాలు, స్నేహితులు, అతగాడి పిల్లల ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్ చూసి కామెంట్ లు విసురుతున్నారట. బండ్ల పిల్లలు కూడా ‘నాన్నా నీకు ఈ వేషం అవసరమా’ అని అడిగారట. దీంతో.. అనిల్ రావిపూడి చేసిన పని వల్ల తన పరువుపోయిందని, అమ్మ నాన్నల దగ్గర, అన్న, బంధువుల దగ్గర కూడా తలెత్తుకోకుండా చేసాడని బండ్ల వాపోతున్నాడట. తొంభైశాతం క్యారెక్టర్ ను తీసేసే ఉద్దేశం వున్నపుడు, మొత్తం తీసేసినా తాను బాధపడేవాడిని కాదని అంటున్నాడట. పాపం.. బండ్ల రీ-ఎంట్రీ అదిరిపోతుందనుకుంటే.. తుస్సుమంది.