మహేష్, బన్నీ.. ఎవరు ఎక్కువ లాభాలు తెచ్చారు ?

మహేష్, అల్లు అర్జున్ సంక్రాంతి సీజన్ లో శత్రువులు. కానీ, వీరిద్దరు నిర్మాత దిల్ రాజుకి మిత్రులు. ఎందుకంటే ? ఈ రెండు సినిమాల్లోనూ దిల్ రాజుకి వాటా ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకి దిల్ రాజు సహ నిర్మాత. అల.. వైకుంఠపురంలో సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలా రెండు సంక్రాంతి సినిమాల ద్వారా దిల్ రాజు లాభాలు గడించారు.

ఈ రెండు సినిమాల్లో దిల్ రాజు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏది అంటే.. ? ‘అల.. వైకుంఠపురంలో’నే అంటున్నారు. ఈ సంక్రాంతికి దిల్ రాజుకి రూ.20కోట్ల మేరకు లాభాలు వస్తున్నాయి. ఇందులో సరిలేరు సినిమా ఇచ్చిన లాభాలు వున్నాయి. అల వైకుంఠపురములో సినిమా లాభాలు వున్నాయి. అల వైకుంఠపురములో సినిమా మీదనే దిల్ రాజు ఎక్కువ లాభాలను కమిషన్ రూపంలో ఆర్జిస్తున్నట్లు సమాచారమ్. ఈ నేపథ్యంలో మహేష్ కంటే బన్నీనే దిల్ రాజుని ఎక్కువ ఖుషి చేశారని అభిమానులు చెప్పుకొంటున్నారు.