‘డిస్కోరాజా’ నుంచి మరో మేకింగ్ వీడియో !

వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘డిస్కోరాజా’. నభా నటాషా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. బాబీ సింహా కీలక ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నారు. రేపే (జనవరి 24) డిస్కోరాజా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో మేకింగ్ వీడియోని విడుదల చేశారు.

ఇప్పటికే టీజర్, ట్రైలర్ లలో చూపించిన బిట్స్ సీన్స్ తో పాటు కొన్ని మేకింగ్ బిట్ సీన్స్ తో మేకింగ్ వీడియోని వదిలారు. గ్లామర్ టచ్ కూడా ఇచ్చారు. హీరోయిన్స్ పాయల్, నభా నటాషా మేకింగ్ వీడియోలో కనిపించారు. రవితేజ ఫ్యామిలీ కూడా సెట్స్ లో కనిపించారు. మొత్తానికి.. డిస్కోరాజా మేకింగ్ వీడియో కలర్ ఫుల్ గా ఉంది. మీరు కూడా చూసేయండీ.. !