నాబార్డ్’కు హరీష్ రిక్వెస్ట్

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకి నాబార్డ్ రుణాలివ్వాలని కోరారు మంత్రి హరీష్ రావు. గురువారం హైదరాబాద్ లో జరిగిన ‘నాబార్డ్‌ సంస్థ రాష్ట్ర సదస్సు-2020’కి మంత్రి హరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్.. నాబార్డ్‌   వ్యవసాయ రంగానికే  కాకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. వ్యవసాయ  అనుబంధ రంగాలపై కూడా నాబర్డ్‌ దృష్టి పెట్టాలని కోరారు. టెక్నాలజీతో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం ఫార్మర్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి హరీష్ స్పష్టం చేశారు. గోదాముల నిర్మాణం, సూక్ష్మ సేద్యానికి నాబార్డు అండగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌తో రైతులకు భరోసా ఇచ్చామన్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా రైతు కాబట్టే.. రైతుల సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో హైటెక్ ప్రాక్టీస్‌ అగ్రికల్చర్‌పై ప్రత్యేక దృష్టిపెట్టిందని హరీష్ అన్నారు.