బన్నీ మేనమామ సడెన్ డెత్
‘అల.. వైకుంఠపురంలో’ హిట్ కిక్కులో ఉన్న స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో విషాదం నెలకొంది. బన్నీ మేనమా ముత్తంశెట్టి ప్రసాద్ హఠాత్మరణం చెందారు. బుధవారం విజయవాడలో ముత్తంశెట్టి ప్రసాద్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దీంతో.. అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు, మెగా ఫ్యామిలీ విజయవాడకు చేరుకున్నాయి.
ముత్తంశెట్టి ప్రసాద్ స్వయానా అల్లు అర్జున్ తల్లి నిర్మలాదేవికి అన్నయ్య. బన్నీకి పెద్ద మావయ్య. చిన్నప్పటి నుంచి మేనమామతో బన్నీకి మంచి సాన్నిహిత్యం ఉంది. బన్నీ తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముత్తంశెట్టి ప్రసాద్ నిర్మాత. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన చురుకుగా పాల్గొన్నారు.
సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఆయన మృతిచెందడం అల్లు అర్జున్ ఫ్యామిలీని తీవ్రంగా కలిచివేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ని. మేనమామగా కాకుండా బన్నీకి మంచి స్నేహితుడిగా ముత్తంశెట్టి ప్రసాద్ ఉండేవారని తెలుస్తోంది. అల.. వైకుంఠపురంలో హిట్ ని పూర్థి స్థాయిలో ఎంజాయ్ చేయకముందే బన్నీ ఫ్యామిలీ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.