‘పటాస్’ తెలుగు టైటిల్ మారింది

తమిళ్ స్టార్ ధనుష్ తాజా చిత్రం ‘పటాస్’. ఈ చిత్రానికి ఆర్.ఐ దురై సెంతిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ధనుష్ కి జంటగా మెహ్రీన్ నటించింది. సీనియర్ హీరోయిన్ స్నేహ, యువ నటుడు నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రుస్తుం’గా తీసుకురావాలని భావించారు.

తాజాగా.. పటాస్ తెలుగు టైటిల్ ని మార్చారు. ‘రుస్తం’కి బదులుగా ‘లోకల్ బోయ్’ టైటిల్ పెట్టారు. ఈ మేరకు పోస్టర్స్ కూడా వదిలారు. ఈ సినిమాలో ధనుష్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ తెలుగులో సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే తమిళ్ పటాస్ ని తెలుగులో లోకల్ బోయ్ గా తీసుకొస్తున్నారు. ఇక గత యేడాది ధనుష్ అసురన్ తో ఘన విజయం అందుకున్నారు. ఈ సినిమా తెలుగు రిమేక్ లో విక్టరీ వెంకటేష్ నటించనున్నారు. ఈ చిత్రంలో ప్రియమణిని హీరోయిన్ గా తీసుకున్నారు.