బాలయ్యను దిష్టబొమ్మ అనేశాడు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నందమూరి అభిమానులకి గెలికాడు. నటసింహం నందమూరి బాలకృష్ణని దిష్టబొమ్మ అంటూ తన పైత్యం చూపాడు. అసలు విషయం ఏంటంటే.. ? బుధవారం ఏపీ శాసనమండలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మండ‌లిలో చ‌ర్చ సాగుతూ ఉండ‌గా.. ఆ స‌మ‌యంలో తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా, వైసీపీ ఎమ్మెల్యేలు గ్యాల‌రీల్లో కూర్చుని వీక్షించారు. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌తో కలిసి సెల్ఫీ దిగారు.

బాలయ్య-రోజా సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీరియస్ మూడు.. ఈ సిల్లీ పనులేంటని వైకాపా నేతలు కొందరు రోజాని విమర్శించారు. ఇక ఈ సెల్ఫీ పిక్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. ‘వావ్ రోజాగారూ.. ఈ సెల్ఫీలో ఆమె హీరోలా ఉన్నారు. ఆమె ప‌క్క‌న కుడివైపు ఉన్న వ్య‌క్తి చూడ‌టానికి యాక్.. ఈ  ఫొటోను అత‌డి ఫేస్ స్పాయిల్ చేస్తూ ఉంది. బ‌హుశా అత‌డు ఆమెకు దిష్టి బొమ్మేమో’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. దీంతో వర్మపై నందమూరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.