అనారోగ్యంపై స్పందించిన సునీల్
టాలీవుడ్ నటుడు సునీల్ అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్ మాధాపూర్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వచ్చిన వార్తలు అభిమానులు, ఇండస్ట్రీని షాక్ కి గురిచేశారు. అసలు సునీల్ కి ఏమైంది ? అని అందరు ఆరా తీయడం మొదలెట్టారు. ఇంతలో సునీల్ నే స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపాడు.
సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగానే ఆసుపత్రిలో చేరానని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని సునీల్ తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు. వైద్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారని సునీల్ తెలిపారు. ఇక సునీల్ నటించిన ‘డిస్కోరాజా’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.