సునీల్’కి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక !

కమెడియన్ కమ్ హీరో సునీల్ తీవ్ర అస్వస్థతకి గురైనట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ మాధాపూర్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. అసలు సునీల్ కి ఏమైంది ? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

టాలీవుడ్ టాప్ కమెడియన్ గా ఉన్న సునీల్.. హీరోగా టర్న్ తీసుకొన్న సంగతి తెలిసిందే. హీరోగానూ ఒకట్రెండు విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత మాత్రం ఆయన్ని వరుసగా ప్లాపులు పలకరించాయి. దీంతో హీరోగా కొనసాగలేక తిరిగి కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు సునీల్. అరవింద సమేత, చిత్రలహరి, అమర్ అక్భర్ ఆంథోని, అల.. వైకుంఠపురంలో సినిమాలో కమెడియన్ గా నటించారు. కమెడియన్ తిరిగి ఫామ్ లోకి వస్తున్న సునీల్ అస్వస్థతకి గురికావడంతో ఆయన అభిమానులు ఆందోళనకి గురవుతున్నారు.